తొట్టంబేడు, ఏప్రిల్ 26 (పున్నమి న్యూస్( : తొట్టంబేడు మండలం శివనాధపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త గాంధీనాయుడు అకాల మరణం ఆ గ్రామంలో విషాదాన్ని నింపింది. ఆదివారం రాత్రి నిద్రకు ఉపక్రమించిన ఆయన, తెల్లవారుజామున కుమార్తె లేపినప్పటికీ స్పందించలేదు. చుట్టుపక్కల వారు వచ్చి పరిశీలించగా, ఆయన నిద్రలోనే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. గాంధీనాయుడు మరణవార్త తెలిసిన వెంటనే టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు గాలి మురళినాయుడు శివనాధపాలెం చేరుకుని, ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీనాయుడు కుమారుడు ధనశేఖర్‌ను ఓదార్చుతూ, మనోధైర్యంతో ఉండాలని సూచించారు. ఫోన్ ద్వారా పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల ఈ విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చరవాణి (ఫోన్) ద్వారా గాంధీనాయుడు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, ఈ కష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. పార్టీ కోసం ఆయన చేసిన సేవలను వారు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

గాంధీనాయుడు మృతి పట్ల ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సంతాపం