అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు అరకు సీఐ ఏ.కోటేశ్వరరావు ఆధ్వర్యంలో అరకులియ మండలం గన్నెల ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హైస్కూల్లో మహిళల రక్షణపై అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. పాడేరు డీఎస్పీ రాజసింహారెడ్డి పాల్గొని మహిళా చట్టాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించారు. సమస్యలు ఎదురైతే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, బాల్య వివాహాలకు దూరంగా ఉండాలని, బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో అరకు ఎస్సై టి.మల్లేశ్వరరావు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

గన్నెల బాలికల పాఠశాలలో మహిళల రక్షణపై అవగాహన