Thursday, 18 June 2026
  • Home  
  • విజయం వెనుక పట్టుదల… హాకీ వీరులకు యలమంచిలి ప్రజల అభినందనల వెల్లువ…!
- అనకాపల్లి

విజయం వెనుక పట్టుదల… హాకీ వీరులకు యలమంచిలి ప్రజల అభినందనల వెల్లువ…!

ఎలమంచిలి , జూన్ 17 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషుల హాకీ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి ఛాంపియన్‌గా నిలిచిన అనకాపల్లి జిల్లా హాకీ జట్టుకు యలమంచిలిలో ఘన స్వాగతం లభించింది. విజయ కప్పుతో స్వగ్రామానికి చేరుకున్న క్రీడాకారులకు రైల్వే స్టేషన్ వద్ద క్రీడాభిమానులు, పట్టణ ప్రజలు హర్షధ్వానాలతో అభినందనలు తెలిపారు. రైల్వే స్టేషన్ మాస్టర్ అశోక్ పుష్పగుచ్ఛాలు అందించి విజేతలను సత్కరించారు. క్రీడాకారులు తమ విజయానికి కఠోర శ్రమ, క్రమశిక్షణ, జట్టు సమన్వయమే కారణమని పేర్కొన్నారు. ఈ విజయం అనకాపల్లి జిల్లాలో హాకీ క్రీడాభివృద్ధికి కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జట్టు విజయానికి కీలక పాత్ర పోషించిన కోచ్ రాంబాబును క్రీడా వర్గాలు ప్రత్యేకంగా అభినందించాయి. జిల్లా హాకీ అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. “పట్టుదల, ప్రతిభ, పరాక్రమానికి ప్రతీకగా నిలిచిన అనకాపల్లి హాకీ జట్టు… రాష్ట్ర విజేతలుగా చరిత్ర సృష్టించింది.”

ఎలమంచిలి , జూన్ 17 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషుల హాకీ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి ఛాంపియన్‌గా నిలిచిన అనకాపల్లి జిల్లా హాకీ జట్టుకు యలమంచిలిలో ఘన స్వాగతం లభించింది. విజయ కప్పుతో స్వగ్రామానికి చేరుకున్న క్రీడాకారులకు రైల్వే స్టేషన్ వద్ద క్రీడాభిమానులు, పట్టణ ప్రజలు హర్షధ్వానాలతో అభినందనలు తెలిపారు.
రైల్వే స్టేషన్ మాస్టర్ అశోక్ పుష్పగుచ్ఛాలు అందించి విజేతలను సత్కరించారు. క్రీడాకారులు తమ విజయానికి కఠోర శ్రమ, క్రమశిక్షణ, జట్టు సమన్వయమే కారణమని పేర్కొన్నారు. ఈ విజయం అనకాపల్లి జిల్లాలో హాకీ క్రీడాభివృద్ధికి కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
జట్టు విజయానికి కీలక పాత్ర పోషించిన కోచ్ రాంబాబును క్రీడా వర్గాలు ప్రత్యేకంగా అభినందించాయి. జిల్లా హాకీ అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.
“పట్టుదల, ప్రతిభ, పరాక్రమానికి ప్రతీకగా నిలిచిన అనకాపల్లి హాకీ జట్టు… రాష్ట్ర విజేతలుగా చరిత్ర సృష్టించింది.”

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.