Saturday, 23 May 2026
  • Home  
  • *గన్నవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు*
- ఆంధ్రప్రదేశ్

*గన్నవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు*

*రంగన్నగూడెంలో రూ.45 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, రూ.1.32 కోట్ల వ్యయంతో చేపట్టిన విద్యుత్ ఆధునీకరణ పనులకు ప్రారంభం* *సింగన్నగూడెం, రంగన్నగూడెం గ్రామాల అభివృద్ధికి రూ.5.66 కోట్ల నిధుల కేటాయించాం : యార్లగడ్డ* *మల్లవల్లి గ్రామంలో రూ.1.05 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన యార్లగడ్డ* *గత ప్రభుత్వ హయాంలో నారా లోకేష్ పాదయాత్ర సాకుతో 52 మందిపై పెట్టిన తప్పుడు కేసులు దుర్మార్గం* *గతంలో కేడీసీసీ బ్యాంక్‌ను నెంబర్ వన్‌గా నిలిపినట్లే, గన్నవరాన్ని అభివృద్ధిలో ముందుంచుతా: ఎమ్మెల్యే యార్లగడ్డ* గన్నవరం పున్నమి ప్రతినిధి సురేష్ గన్నవరం నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్‌లోనే ఆదర్శవంతమైన మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. శనివారం బాపులపాడు మండలంలో పర్యటించిన ఆయన రంగన్నగూడెం, మల్లవల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంబించారు. రంగన్నగూడెం గ్రామంలో రూ.45 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను, RDSS పథకం ద్వారా రూ.1.32 కోట్ల వ్యయంతో చేపట్టిన విద్యుత్ ఆధునీకరణ పనులను బూత్ లెవెల్ ఏజెంట్లతో కలసి ప్రారంభించారు. సింగన్నగూడెం, రంగన్నగూడెం గ్రామాలకు కలిపి మొత్తం రూ.5.66 కోట్ల నిధులను కేటాయించినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. అనంతరం మల్లవల్లి గ్రామంలో రూ.37.50 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, రూ.67.54 లక్షలతో నిర్మించిన స్వర్ణ గ్రామం భవనం, ఆర్‌ఎస్‌కే భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. యువగళం పాదయాత్ర రంగన్నగూడెం గ్రామం మీదుగా వెళ్లిందనే నెపంతో 52 మంది అమాయక గ్రామస్తులపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చెరువులను అక్రమంగా తవ్వి మట్టిని దోచుకున్నారని, ఇకపై అక్రమ తవ్వకాలకు తావులేదని స్పష్టం చేశారు. చెరువుల్లోని మట్టిని ప్రార్థనా స్థలాలు, పాఠశాలలు, స్మశాన వాటికలు మరియు రైతుల ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తూ వినియోగించాలని అధికారులను ఆదేశించారు. గతంలో కేడీసీసీ బ్యాంక్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన విధంగానే గన్నవరాన్ని కూడా అభివృద్ధిలో ముందంజలో ఉంచుతానని ధీమా వ్యక్తం చేశారు. మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఎన్డీయే కూటమిలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ప్రజలతో మమేకమై పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం చేయగా మరికొన్ని సమస్యలను త్వరిగతిన పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో మురళీకృష్ణ, ఏండిఓ జోగేశ్వరరావు, మండల టిడిపి అధ్యక్షులు దయాల రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పుట్టా సురేష్, రాష్ట్ర టిడిపి కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణి, ఆళ్ల గోపాలకృష్ణ, వేములపల్లి శ్రీనివాసరావు, అక్కినేని ధర్మరాజు, పల్లగాని వీరాంజనేయులు, మొవ్వ వేణుగోపాల్, బెజవాడ కృష్ణ, పుసులూరు లక్ష్మీనారాయణ, కసుకుర్తి వేణుబాబు, అక్కినేని కృష్ణాజీ, కొల్లూరు చంద్రకాంత్, లంకా అజయ్, కొమ్మారెడ్డి రాజేష్, కసుకుర్తి కిషోర్, మార్జావలి, చాన్ భాష, చిన్నాల లక్ష్మీ నారాయణ, అక్కినేని గోకుల్, పరమేశ్వరరావు, యనమదల గీతారం, ఆలూరి సురేష్, తమ్మిశెట్టి రాము, తూము ప్రసాద్, గజ్జల సాంబయ్య, వణుకురి జోజి, తూము చంద్రశేఖర్, వేముల శివకృష్ణ, కట్టుబోయిన శ్రీనివాసరావు, యేసోబు, వేముల కాసులు, చిలకపాటి శ్రీనివాసరావు, అన్నే హరికృష్ణ, కసుకుర్తి రంగామణి, మొవ్వ శ్రీనివాసరావు, కనకవల్లి శేషగిరిరావు, మందపాటి రాంబాబు, కొల్లూరు చంద్రకాంత్, లింగం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

*రంగన్నగూడెంలో రూ.45 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, రూ.1.32 కోట్ల వ్యయంతో చేపట్టిన విద్యుత్ ఆధునీకరణ పనులకు ప్రారంభం*

*సింగన్నగూడెం, రంగన్నగూడెం గ్రామాల అభివృద్ధికి రూ.5.66 కోట్ల నిధుల కేటాయించాం : యార్లగడ్డ*

*మల్లవల్లి గ్రామంలో రూ.1.05 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన యార్లగడ్డ*

*గత ప్రభుత్వ హయాంలో నారా లోకేష్ పాదయాత్ర సాకుతో 52 మందిపై పెట్టిన తప్పుడు కేసులు దుర్మార్గం*

*గతంలో కేడీసీసీ బ్యాంక్‌ను నెంబర్ వన్‌గా నిలిపినట్లే, గన్నవరాన్ని అభివృద్ధిలో ముందుంచుతా: ఎమ్మెల్యే యార్లగడ్డ*

గన్నవరం పున్నమి ప్రతినిధి సురేష్

గన్నవరం నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్‌లోనే ఆదర్శవంతమైన మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. శనివారం బాపులపాడు మండలంలో పర్యటించిన ఆయన రంగన్నగూడెం, మల్లవల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంబించారు. రంగన్నగూడెం గ్రామంలో రూ.45 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను, RDSS పథకం ద్వారా రూ.1.32 కోట్ల వ్యయంతో చేపట్టిన విద్యుత్ ఆధునీకరణ పనులను బూత్ లెవెల్ ఏజెంట్లతో కలసి ప్రారంభించారు. సింగన్నగూడెం, రంగన్నగూడెం గ్రామాలకు కలిపి మొత్తం రూ.5.66 కోట్ల నిధులను కేటాయించినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. అనంతరం మల్లవల్లి గ్రామంలో రూ.37.50 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, రూ.67.54 లక్షలతో నిర్మించిన స్వర్ణ గ్రామం భవనం, ఆర్‌ఎస్‌కే భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. యువగళం పాదయాత్ర రంగన్నగూడెం గ్రామం మీదుగా వెళ్లిందనే నెపంతో 52 మంది అమాయక గ్రామస్తులపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చెరువులను అక్రమంగా తవ్వి మట్టిని దోచుకున్నారని, ఇకపై అక్రమ తవ్వకాలకు తావులేదని స్పష్టం చేశారు. చెరువుల్లోని మట్టిని ప్రార్థనా స్థలాలు, పాఠశాలలు, స్మశాన వాటికలు మరియు రైతుల ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తూ వినియోగించాలని అధికారులను ఆదేశించారు. గతంలో కేడీసీసీ బ్యాంక్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన విధంగానే గన్నవరాన్ని కూడా అభివృద్ధిలో ముందంజలో ఉంచుతానని ధీమా వ్యక్తం చేశారు. మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఎన్డీయే కూటమిలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ప్రజలతో మమేకమై పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం చేయగా మరికొన్ని సమస్యలను త్వరిగతిన పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో మురళీకృష్ణ, ఏండిఓ జోగేశ్వరరావు, మండల టిడిపి అధ్యక్షులు దయాల రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పుట్టా సురేష్, రాష్ట్ర టిడిపి కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణి, ఆళ్ల గోపాలకృష్ణ, వేములపల్లి శ్రీనివాసరావు, అక్కినేని ధర్మరాజు, పల్లగాని వీరాంజనేయులు, మొవ్వ వేణుగోపాల్, బెజవాడ కృష్ణ, పుసులూరు లక్ష్మీనారాయణ, కసుకుర్తి వేణుబాబు, అక్కినేని కృష్ణాజీ, కొల్లూరు చంద్రకాంత్, లంకా అజయ్, కొమ్మారెడ్డి రాజేష్, కసుకుర్తి కిషోర్, మార్జావలి, చాన్ భాష, చిన్నాల లక్ష్మీ నారాయణ, అక్కినేని గోకుల్, పరమేశ్వరరావు, యనమదల గీతారం, ఆలూరి సురేష్, తమ్మిశెట్టి రాము, తూము ప్రసాద్, గజ్జల సాంబయ్య, వణుకురి జోజి, తూము చంద్రశేఖర్, వేముల శివకృష్ణ, కట్టుబోయిన శ్రీనివాసరావు, యేసోబు, వేముల కాసులు, చిలకపాటి శ్రీనివాసరావు, అన్నే హరికృష్ణ, కసుకుర్తి రంగామణి, మొవ్వ శ్రీనివాసరావు, కనకవల్లి శేషగిరిరావు, మందపాటి రాంబాబు, కొల్లూరు చంద్రకాంత్, లింగం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.