ఉదయగిరి మండలం గండిపాలెం జలాశయం సమీపంలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో శనివారం స్వామివారికి చందన అలంకరణను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక సేవకు ఆలయ అర్చకులు లోకా వెంకట ప్రసాద్ శర్మ కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రత్యేక అలంకరణ అనంతరం స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం ఇసుకపల్లి గ్రామానికి చెందిన భక్తురాలు గంగవరపు పద్మయ్య కుటుంబ సభ్యులు భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని భక్తిశ్రద్ధలతో పంపిణీ చేసి అన్నివర్గాల భక్తుల ఆశీర్వాదాలు అందుకున్నారు.

గండిపాలెం శ్రీ సిద్ధేశ్వరస్వామికి వైభవంగా చందన అలంకరణ.. భక్తులకు ప్రసాదాల పంపిణీ