ఉదయగిరి మండలంలోని గండిపాలెంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు (APGB)లో లాకర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని ఖాతాదారులు కోరుతున్నారు. ఈ బ్యాంకు పరిధిలో సుమారు 20 గ్రామాలకు చెందిన వేలాది మంది ఖాతాదారులు సేవలు పొందుతున్నారు. అయితే లాకర్ సౌకర్యం లేకపోవడంతో బంగారం, విలువైన పత్రాలు భద్రపరచేందుకు పామూరు, ఉదయగిరి, వింజమూరు వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖాతాదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకు ఉన్నతాధికారులు గండిపాలెం శాఖలో వీలైనంత త్వరగా లాకర్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని వారు విజ్ఞప్తి చేశారు.

గండిపాలెం ఏపీజీబీలో లాకర్ సౌకర్యం కల్పించాలి: ఖాతాదారుల విజ్ఞప్తి