ఖమ్మం నగరంలో శనివారం బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర పర్యటించారు. నెహ్రునగర్‌లో నూతనంగా ప్రారంభించిన డాక్టర్ జ్యోత్స్న మెటర్నిటీ, ఫెర్టిలిటీ హాస్పిటల్‌ను వారు సందర్శించారు. ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ శ్రీకాంత్ పెద్దినేని, డాక్టర్ జ్యోత్స్న పెద్దినేని సాదర స్వాగతం పలికారు. ఆపరేషన్ థియేటర్, వార్డ్ రూమ్స్, ల్యాబ్‌తో పాటు ఇతర వైద్య సదుపాయాలను పరిశీలించి, అందిస్తున్న సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం నగరంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన ప్రసూతి, ఫెర్టిలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. అనంతరం ఆసుపత్రి యాజమాన్యం పెద్దినేని క్రిష్ణమూర్తి, డాక్టర్ శ్రీకాంత్ పెద్దినేని, డాక్టర్ జ్యోత్స్న పెద్దినేని ఆధ్వర్యంలో నామ, వద్దిరాజులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
నూతన వధూవరులకు నామ ఆశీర్వాదం
టేకులపల్లి గ్రామం, ఖానాపురం హవేలీ వాస్తవ్యులు, మాజీ సుడా డైరెక్టర్ దొంగల తిరుపతిరావు ఇందిరల కుమార్తె వివాహం వీరబాబుతో జరగడంతో నామ వారి స్వగృహానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
చింతల లింగయ్య కుటుంబానికి నామ పరామర్శ
టీడీపీ సీనియర్ నేత చింతల లింగయ్య మృతి నేపథ్యంలో నామ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, లింగయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి, లింగయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.



