ఖమ్మం ఆగష్టు 6
(పున్నమి న్యూస్ ప్రతినిధి)
ఖమ్మం శాసనసభ నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. మొత్తం 3,28,203 మంది ఓటర్లలో 2,43,976 మంది వివరాలను అధికారులు డిజిటలైజ్ చేశారు. ఈ ప్రక్రియలో వివిధ కారణాలతో 74,984 ఓట్లను తొలగించారు. ఒకే వ్యక్తికి ఖమ్మంలోనూ, స్వగ్రామంలోనూ ఓటు ఉండటంతో చాలామంది స్వగ్రామ ఓటుకే ప్రాధాన్యం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. సవరించిన వివరాల ఆధారంగా ఈ నెల 17న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు.



