ఖమ్మం, జూన్
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా రిపోర్టర్ )
భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు కోదాడ పర్యటనకు వెళ్తూ మార్గమధ్యంలో ఖమ్మం రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ, పార్టీ సీనియర్ నాయకులు గేంటెల విద్యాసాగర్, జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు పుష్పగుచ్ఛాలు అందజేసి సత్కరించారు. వెంకయ్య నాయుడితో పార్టీ నాయకులు కొద్దిసేపు ముచ్చటించారు



