పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి క్యాంప్ కార్యాలయంలో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దినేని స్వర్ణకుమారి, రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయ ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తోందన్నారు. ఎంపీ రఘురాం రెడ్డి నిరంతరం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని, ఖమ్మం ఉమ్మడి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో పర్యటిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడుతున్నారని తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో ఉమ్మడి జిల్లా సమస్యలను ప్రస్తావిస్తూ, కేంద్ర మంత్రులను కలిసి నిధులు మంజూరు చేయించాలని కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతూ దేశ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొప్పుల చంద్రశేఖర్, ప్రతిభా రెడ్డి, పట్టాభి, మియా భాయ్, ఇమామ్, గోనె భుజంగ రెడ్డి, ఎనిగళ్ళ నాగేశ్వరరావు, గడ్డం శ్రీకళా రెడ్డి, మాజీద్, గౌస్, ఉమర్, ఉమా గౌడ్, నరసింహారావు తదితరులు, ప్రజా ప్రతినిధులు, అనుబంధ సంఘాల బాధ్యులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.



