ఖమ్మం జిల్లా కేంద్రంలోని జెడ్పీ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బండ్ల రీగాన్ ప్రతాప్ అధ్యక్షతన ‘సేవా-ఆశీర్వాద’ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద మోదీ కోసం 25 ఆశీర్వాద దీపాలను ప్రజ్వలన చేసి, అనంతరం ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మోదీకి ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శ్రీ రామనేని మణి, పమ్మి అనిత తదితరులు పాల్గొన్నారు.



