బెల్లంపల్లి పట్టణంలోని 33వ వార్డులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండి రాము, బండి లక్ష్మణ్, యూత్ కాంగ్రెస్ నాయకులు అరుణ్ వాల్మీకి ఆధ్వర్యంలో వార్డ్ యువతకు మంగళవారం క్రికెట్ కిట్ అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని తెలిపారు. క్రీడల్లో పాల్గొనే వారికి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రికెట్ కిట్ అందజేసిన నాయకులకు క్రీడాకారులు ధన్యవాదాలు తెలిపారు.




