SC, ST అట్రాసిటీ పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు కొప్పాల రఘు ఆమోదంతో, సంస్థ నియమావళి మేరకు కోవూరు నియోజకవర్గ అధ్యక్షులుగా ఈదూరి మనోహర్‌ను అధికారికంగా నియమించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కొప్పాల రఘు మాట్లాడుతూ, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం, ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కుల సాధన కోసం కమిటీని గ్రామ స్థాయి వరకు విస్తరించే దిశగా సంస్థ ముందుకు సాగుతోందన్నారు. కోవూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం, చట్టాలపై అవగాహన కల్పించడం, బాధితులకు న్యాయం అందించడంలో ఈదూరి మనోహర్ సమర్థవంతంగా పనిచేస్తారనే నమ్మకం వ్యక్తం చేశారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఈదూరి మనోహర్ మాట్లాడుతూ, రాష్ట్ర అధ్యక్షులు కొప్పాల రఘు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని, రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి గ్రామంలో కమిటీని బలోపేతం చేస్తూ ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కుల పరిరక్షణకు అంకితభావంతో సేవలందిస్తానని తెలిపారు.
కమిటీ రాష్ట్ర, జిల్లా నాయకులు, సభ్యులు ఈదూరి మనోహర్‌కు అభినందనలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో కోవూరు నియోజకవర్గంలో సంస్థ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

