తిరుపతి రూరల్, సెప్టెంబర్ 6 పున్నమి ప్రతినిధి
తిరుపతి రూరల్ తిరుచానూరు మండలం కొత్తూరు గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో ‘మన ఊరు–మన జెండా’ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు సుభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు చక్రపాణి, బీజేవైఎం రాష్ట్ర జనరల్ సెక్రటరీ నాగోతు హరికృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దేశభక్తి, జాతీయ సమైక్యత, గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలోపేతం వంటి అంశాలపై నాయకులు మాట్లాడారు. ప్రజల్లో దేశభక్తి భావనను మరింత పెంపొందించడమే ‘మన ఊరు–మన జెండా’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు పుష్పరెడ్డి, సీనియర్ నాయకులు వెంకటేష్,ప్రసాద్, నాగరాజు, భూపాల ఆచారి తదితర నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

