Monday, 10 August 2026
  • Home  
  • కుబీర్ లో విషాదం.. ఎల్లమ్మ చెరువులో మునిగి ఇద్దరు బాలుర మృతి.
- నిర్మల్

కుబీర్ లో విషాదం.. ఎల్లమ్మ చెరువులో మునిగి ఇద్దరు బాలుర మృతి.

నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని ఎల్లమ్మ చెరువు(డోడర్నా చెరువు)లో సోమవారం ఇద్దరు బాలురు మునిగి మృతి చెందారు. కుబీర్ లో ఓ ప్రవేట్. పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న గణేష్, 3వ తరగతి చదువుతున్న సోఫియాన్(10) స్నేహితుడితో కలిసి పొలం పక్కనున్న చెరువులో స్నానానికి వెళ్లారు. ఈతలో లోతు గమనించక ఇద్దరూ మునిగిపోయారు. మృతదేహాలను భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. భైంసా ఏఎస్పీ సాయికిరణ్, సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై కృష్ణారెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో కుబీర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. Uploaded Video:

నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని ఎల్లమ్మ చెరువు(డోడర్నా చెరువు)లో సోమవారం ఇద్దరు బాలురు మునిగి మృతి చెందారు.

కుబీర్ లో ఓ ప్రవేట్. పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న గణేష్, 3వ తరగతి చదువుతున్న సోఫియాన్(10) స్నేహితుడితో కలిసి పొలం పక్కనున్న చెరువులో స్నానానికి వెళ్లారు.

ఈతలో లోతు గమనించక ఇద్దరూ మునిగిపోయారు.

మృతదేహాలను భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. భైంసా ఏఎస్పీ సాయికిరణ్, సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై కృష్ణారెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనతో కుబీర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.