డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని ముమ్మిడివరం మండలం పదో మైలురాయి వద్ద కుంచనపల్లి నారాయణ ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను శాసనసభ విప్, ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు.ఇటువంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మంచి ఆరోగ్యంతో పాటు ఉపాధి అవకాశాలు సైతం మెరుగుపడతాయని దాట్ల సుబ్బరాజు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తాడి నరసింహారావు,చెల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

కుంచనపల్లి నారాయణ ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు