– కార్మికులు ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలి
రైల్వేకోడూరు: కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసి, కార్మికులకు కనీస వేతనం రూ.42 వేలు అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి పిలుపునిచ్చారు. శనివారం రైల్వేకోడూరు ఎన్జీవో హోంలో సీఐటీయూ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ, వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


