వరికుంటపాడు,పున్నమి ప్రతినిధి:
ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జన్మదినం సందర్భంగా శనివారం వరికుంటపాడులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకులు వడ్లమూడి నాగేంద్ర ఆధ్వర్యంలో అర్చకులు ఎమ్మెల్యే గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ.. 2029లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, కాకర్ల సురేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని స్వామివారిని మొక్కుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే సురేష్ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. జన్మదినాన్ని పురస్కరించుకుని వచ్చే శనివారం ఆలయంలో నిర్వహించనున్న అన్నదాన కార్యక్రమానికి అవసరమైన సామగ్రిని ఆలయానికి బహూకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పెండ్యాల సూర్యనారాయణ, కాకొల్లు పెద్ద కేవీఆర్, కాకొల్లు బాబు, మన్యం వెంకటస్వామి, గంగవరపు వెంకటేశ్వర్లు, గురుస్వామి, తిరుపతయ్య, కృష్ణయ్య, భక్తులు తదితరులు పాల్గొన్నారు

కాకర్ల సురేష్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు గోత్రనామాలతో వెంకటేశ్వర స్వామివారికి అర్చనలు
వరికుంటపాడు,పున్నమి ప్రతినిధి: ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జన్మదినం సందర్భంగా శనివారం వరికుంటపాడులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకులు వడ్లమూడి నాగేంద్ర ఆధ్వర్యంలో అర్చకులు ఎమ్మెల్యే గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ.. 2029లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, కాకర్ల సురేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని స్వామివారిని మొక్కుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే సురేష్ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. జన్మదినాన్ని పురస్కరించుకుని వచ్చే శనివారం ఆలయంలో నిర్వహించనున్న అన్నదాన కార్యక్రమానికి అవసరమైన సామగ్రిని ఆలయానికి బహూకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పెండ్యాల సూర్యనారాయణ, కాకొల్లు పెద్ద కేవీఆర్, కాకొల్లు బాబు, మన్యం వెంకటస్వామి, గంగవరపు వెంకటేశ్వర్లు, గురుస్వామి, తిరుపతయ్య, కృష్ణయ్య, భక్తులు తదితరులు పాల్గొన్నారు

