Sunday, 6 September 2026
  • Home  
  • కాంగ్రెస్లో క్రమశిక్షణ కొరడా ఏడుగురు నేతలకు షోకాజ్ నోటీసులు
- రాజన్న సిరిసిల్ల

కాంగ్రెస్లో క్రమశిక్షణ కొరడా ఏడుగురు నేతలకు షోకాజ్ నోటీసులు

రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 6 (పున్నమి ప్రతినిధి) రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడుగురు నేతలకు టీపీసీసీ క్రమశిక్షణా చర్యల కమిటీ (DAC) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. జూలై 5న సిరిసిల్ల ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకంపై పార్టీ నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించడంతో పాటు, టీపీసీసీ, డీసీసీ నాయకత్వంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వాటిని వాట్సాప్, సోషల్ మీడియా గ్రూపుల్లో ప్రచారం చేశారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. లచ్చయ్య, ఒరుగంటి నరసింహులు, ఎలుక రాజు, సయ్యద్, గంధ్యాడపు శంకరయ్య, ప్రసాద్ రావు, గంగి స్వామికి నోటీసులు అందాయి. నోటీసులు అందిన 10 రోజుల్లోగా వ్యక్తిగతంగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని DAC ఆదేశించింది. వివరణ సంతృప్తికరంగా లేకుంటే పార్టీ నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 6 (పున్నమి ప్రతినిధి)
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడుగురు నేతలకు టీపీసీసీ క్రమశిక్షణా చర్యల కమిటీ (DAC) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. జూలై 5న సిరిసిల్ల ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకంపై పార్టీ నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించడంతో పాటు, టీపీసీసీ, డీసీసీ నాయకత్వంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వాటిని వాట్సాప్, సోషల్ మీడియా గ్రూపుల్లో ప్రచారం చేశారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. లచ్చయ్య, ఒరుగంటి నరసింహులు, ఎలుక రాజు, సయ్యద్, గంధ్యాడపు శంకరయ్య, ప్రసాద్ రావు, గంగి స్వామికి నోటీసులు అందాయి. నోటీసులు అందిన 10 రోజుల్లోగా వ్యక్తిగతంగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని DAC ఆదేశించింది. వివరణ సంతృప్తికరంగా లేకుంటే పార్టీ నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.