Saturday, 15 August 2026
  • Home  
  • కస్తూర్బా గాంధీ పాఠశాలలో అకస్మిక తనిఖీలు
- పల్నాడు

కస్తూర్బా గాంధీ పాఠశాలలో అకస్మిక తనిఖీలు

పున్నమి న్యూస్ వెల్దుర్తి ప్రతినిధి ఆగస్టు 14:* మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో శుక్రవారం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాఠశాలకు చేరుకున్న ఎమ్మెల్యే విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మౌలిక వసతులు, భోజనశాల, తాగునీటి సదుపాయం, పరిసర పరిశుభ్రత, అడ్మిన్ రికార్డులు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో చెక్ చేశారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిన ఎమ్మెల్యే, వారికి ఎదురవుతున్న బోధనాపరమైన ఇబ్బందులు, హాస్టల్ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాలలో ఉన్న సమస్యలపై చర్చించారు. ఉపాధ్యాయుల కొరతను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అనంతరం జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాల నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. భవన నిర్మాణం, తరగతి గదులు, ల్యాబ్‌లు, హాస్టల్ వంటి మౌలిక సదుపాయాల కల్పన పనుల పురోగతిని సంబంధిత అధికారులతో సమీక్షించారు. నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో కూటమి పార్టీల నాయకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎమ్మెల్యే స్వయంగా వచ్చి పాఠశాలలను పరిశీలించడం పట్ల తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి ఆకస్మిక తనిఖీలతో పాఠశాలల్లో నాణ్యత పెరుగుతుందని అన్నారు.

పున్నమి న్యూస్ వెల్దుర్తి ప్రతినిధి ఆగస్టు 14:*
మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో శుక్రవారం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాఠశాలకు చేరుకున్న ఎమ్మెల్యే విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మౌలిక వసతులు, భోజనశాల, తాగునీటి సదుపాయం, పరిసర పరిశుభ్రత, అడ్మిన్ రికార్డులు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో చెక్ చేశారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిన ఎమ్మెల్యే, వారికి ఎదురవుతున్న బోధనాపరమైన ఇబ్బందులు, హాస్టల్ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాలలో ఉన్న సమస్యలపై చర్చించారు.
ఉపాధ్యాయుల కొరతను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అనంతరం జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాల నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. భవన నిర్మాణం, తరగతి గదులు, ల్యాబ్‌లు, హాస్టల్ వంటి మౌలిక సదుపాయాల కల్పన పనుల పురోగతిని సంబంధిత అధికారులతో సమీక్షించారు. నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో కూటమి పార్టీల నాయకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎమ్మెల్యే స్వయంగా వచ్చి పాఠశాలలను పరిశీలించడం పట్ల తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి ఆకస్మిక తనిఖీలతో పాఠశాలల్లో నాణ్యత పెరుగుతుందని అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.