Tuesday, 21 July 2026
  • Home  
  • కష్టకాలంలో కరుణ చూపిన క్లాస్‌మేట్స్.. వైద్యానికి రూ.25 వేల సాయం
- తూర్పు గోదావరి

కష్టకాలంలో కరుణ చూపిన క్లాస్‌మేట్స్.. వైద్యానికి రూ.25 వేల సాయం

తాళ్లపూడి, జూలై 20:(పున్నమి ప్రతినిధి): తాళ్లపూడి శ్రీ పరస పద్మ రాజారావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2004–05 పదో తరగతి పూర్వ విద్యార్థులు మానవత్వాన్ని చాటుకున్నారు. సర్వైకల్ క్యాన్సర్ చివరి దశతో పాటు రెండు కిడ్నీలు దెబ్బతిని చికిత్స పొందుతున్న కైకరపు సూర్యప్రకాశ్ తల్లి వైద్య ఖర్చుల కోసం రూ.25 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. ఇప్పటికే ఒక కిడ్నీకి స్టెంట్ అమర్చగా, మరో కిడ్నీకి కూడా అత్యవసరంగా స్టెంట్ వేయాలని వైద్యులు సూచించారు. విషయం తెలుసుకున్న బ్యాచ్ సభ్యులు విరాళాలు సేకరించి కుటుంబానికి అందజేశారు. తమ బ్యాచ్‌లో ఎవరి కుటుంబం ఆపదలో ఉన్నా అండగా నిలుస్తామని తెలిపారు. జనవరిలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఊబా రాములు, గెడ్డం గణేష్, సనపల రాజశేఖర్, సువ్వారి రాంబాబు, పేడాడ భాస్కరరావు, పల్లికొండ అశోక్ కుమార్, కూన వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

తాళ్లపూడి, జూలై 20:(పున్నమి ప్రతినిధి):
తాళ్లపూడి శ్రీ పరస పద్మ రాజారావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2004–05 పదో తరగతి పూర్వ విద్యార్థులు మానవత్వాన్ని చాటుకున్నారు. సర్వైకల్ క్యాన్సర్ చివరి దశతో పాటు రెండు కిడ్నీలు దెబ్బతిని చికిత్స పొందుతున్న కైకరపు సూర్యప్రకాశ్ తల్లి వైద్య ఖర్చుల కోసం రూ.25 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. ఇప్పటికే ఒక కిడ్నీకి స్టెంట్ అమర్చగా, మరో కిడ్నీకి కూడా అత్యవసరంగా స్టెంట్ వేయాలని వైద్యులు సూచించారు. విషయం తెలుసుకున్న బ్యాచ్ సభ్యులు విరాళాలు సేకరించి కుటుంబానికి అందజేశారు. తమ బ్యాచ్‌లో ఎవరి కుటుంబం ఆపదలో ఉన్నా అండగా నిలుస్తామని తెలిపారు. జనవరిలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఊబా రాములు, గెడ్డం గణేష్, సనపల రాజశేఖర్, సువ్వారి రాంబాబు, పేడాడ భాస్కరరావు, పల్లికొండ అశోక్ కుమార్, కూన వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.