Tuesday, 28 April 2026
  • Home  
  • కనిగిరిలో పెట్రోల్ బంకులపై ఆకస్మిక తనిఖీలు – వదంతులు నమ్మవద్దని పోలీసుల విజ్ఞప్తి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కనిగిరిలో పెట్రోల్ బంకులపై ఆకస్మిక తనిఖీలు – వదంతులు నమ్మవద్దని పోలీసుల విజ్ఞప్తి

కనిగిరిలో పెట్రోల్ బంకులను సీఐ ఉప్పు శ్రీనివాసరావు, ఎస్సైలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో ఎక్కడా ఇంధన కొరత లేదని, అన్ని బంకుల్లో అవసరానికి సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపారు. ప్రజలు వదంతులు నమ్మకుండా సాధారణంగా ఇంధనం వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. కొంతమంది అవసరానికి మించి ఇంధనం నింపుకోవడం, నిల్వ చేసేందుకు ప్రయత్నించడం గమనించామని పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. పరిస్థితిని అధికారులు నిరంతరం సమీక్షిస్తున్నారని, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.