కడప టూ టౌన్ ఎస్ఐగా ఆర్వీ కొండారెడ్డి బాధ్యతల స్వీకరణ
పున్నమి ప్రతినిధి – కడప:
కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్ నూతన సబ్ఇన్స్పెక్టర్గా ఆర్వీ కొండారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బద్వేల్ పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై ఆయన కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చారు.
ఆర్వీ కొండారెడ్డి గతంలో కడప జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో ఎస్ఐగా విధులు నిర్వహించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకువచ్చి సహకరించాలని కోరారు.



