*కట్టువపల్లిలో దయనీయ స్థితి:*
*చినుకు పడితే చిత్తడే.. నరకప్రాయంగా మారుతున్న వీధులు!*
పున్నమి న్యూస్ రిపోర్టర్ మద్దాలి వెంకయ్య దొరవారిసత్రం
10-08-26
తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండల పరిధిలోని కట్టువపల్లి గ్రామంలో డ్రైనేజీ, రోడ్ల సమస్య జఠిలంగా మారింది. అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో కొద్దిపాటి వర్షానికే మట్టి వీధులన్నీ బురదమయంగా మారుతున్నాయి. నివారణ చర్యలు లేకపోవడంతో స్థానికులు నరకయాతన అనుభవిస్తున్నారు.
గ్రామంలో సరైన డ్రైనేజీ (సైడ్ కాలువలు) వ్యవస్థ లేదు. వర్షపు నీరు, ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు రోడ్లపైనే నిలిచిపోతోంది.మట్టి రోడ్లు కావడంతో ప్రతి వీధి చెరువును తలపిస్తూ బురదగా మారుతోంది.బురద రోడ్ల వల్ల కాలినడకన వెళ్లే వృద్ధులు, పిల్లలు జారిపడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.నిలిచిన నీటి వల్ల దోమలు ప్రబలి, డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం పొంచి ఉంది.గ
“చిన్నపాటి చినుకు పడితే చాలు వీధుల్లో అడుగు పెట్టలేకపోతున్నాం. సైడ్ కాలువలు నిర్మించాలని ఎన్నిసార్లు వేడుకున్నా అధికారులు స్పందించడం లేదు. కట్టువపల్లి గ్రామంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపి, తక్షణమే సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ కాలువలు నిర్మించి మమ్మల్ని ఈ దూర్భరమైన పరిస్థితి నుంచి రక్షించాలి” అని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.



