Friday, 12 June 2026
  • Home  
  • *ఒమన్ తీరంలో ఒక వాణిజ్య నౌకపై జరిగిన అమెరికా సైనిక దాడిలో విశాఖ కు చెందిన మెరైన్ చీఫ్ ఇంజనీర్ మృతి*
- విశాఖపట్నం

*ఒమన్ తీరంలో ఒక వాణిజ్య నౌకపై జరిగిన అమెరికా సైనిక దాడిలో విశాఖ కు చెందిన మెరైన్ చీఫ్ ఇంజనీర్ మృతి*

✨పరిస్థితి బాగోలేదని నా భర్త ముందే చెప్పాడు, లిస్టులో ఫస్ట్ పేరు ఆయనదే.. చీఫ్ ఇంజనీర్ భార్య భార్గవి. ✨విశాఖపట్నం: ఒమన్ తీరంలో ఒక వాణిజ్య నౌకపై జరిగిన అమెరికా సైనిక దాడిలో ముగ్గురు భారతీయులు మృతి చెందడం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన 44 ఏళ్ల మెరైన్ చీఫ్ ఇంజనీర్ సురేష్ కూడా ఉన్నారు. ✨ఈ దాడిపై సురేష్ భార్య భార్గవి పీటీఐతో మాట్లాడారు. భర్త జూన్ 9న తనతో ఫోన్లో మాట్లాడారని, అక్కడ పరిస్థితులు ఏం బాగోలేవని, త్వరలోనే ఇంటికి వచ్చేయాలని ఉందని చెప్పారని తెలిపారు. జూన్ 10న అమెరికా చేసిన దాడిలో ఆయన చనిపోయారు. గత 5 నెలలుగా సముద్రంలోనే విధుల్లో ఉన్న సురేష్, త్వరలోనే ఇంటికి రావాల్సి ఉండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో సురేష్ స్వస్థలమైన విశాఖపట్నంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. సురేష్ విధులను ముగించుకుని ఇంటికి తిరిగి రావడం కోసం అప్పటికే రిలీవింగ్ లెటర్ (ఉద్యోగ విధులనుండి విడుదలకు సంబంధించిన పత్రం) కూడా లభించిందని భార్య భార్గవి తెలిపారు. తాను బాగా అలసిపోయానని, ప్రస్తుతం పరిస్థితులు కూడా బాగోలేవని తన భర్త రిక్వెస్ట్ చేసుకున్నారని తెలిపారు…

✨పరిస్థితి బాగోలేదని నా భర్త ముందే చెప్పాడు, లిస్టులో ఫస్ట్ పేరు ఆయనదే.. చీఫ్ ఇంజనీర్ భార్య భార్గవి.

✨విశాఖపట్నం: ఒమన్ తీరంలో ఒక వాణిజ్య నౌకపై జరిగిన అమెరికా సైనిక దాడిలో ముగ్గురు భారతీయులు మృతి చెందడం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన 44 ఏళ్ల మెరైన్ చీఫ్ ఇంజనీర్ సురేష్ కూడా ఉన్నారు.

✨ఈ దాడిపై సురేష్ భార్య భార్గవి పీటీఐతో మాట్లాడారు. భర్త జూన్ 9న తనతో ఫోన్లో మాట్లాడారని, అక్కడ పరిస్థితులు ఏం బాగోలేవని, త్వరలోనే ఇంటికి వచ్చేయాలని ఉందని చెప్పారని తెలిపారు. జూన్ 10న అమెరికా చేసిన దాడిలో ఆయన చనిపోయారు. గత 5 నెలలుగా సముద్రంలోనే విధుల్లో ఉన్న సురేష్, త్వరలోనే ఇంటికి రావాల్సి ఉండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో సురేష్ స్వస్థలమైన విశాఖపట్నంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

సురేష్ విధులను ముగించుకుని ఇంటికి తిరిగి రావడం కోసం అప్పటికే రిలీవింగ్ లెటర్ (ఉద్యోగ విధులనుండి విడుదలకు సంబంధించిన పత్రం) కూడా లభించిందని భార్య భార్గవి తెలిపారు. తాను బాగా అలసిపోయానని, ప్రస్తుతం పరిస్థితులు కూడా బాగోలేవని తన భర్త రిక్వెస్ట్ చేసుకున్నారని తెలిపారు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.