ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (UTF) అనంతగిరి మండల శాఖ ఆధ్వర్యంలో అల్లూరి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సభకు నరాజీ మల్లేశ్వరరావు అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పుడిగి దేముడు, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ శెట్టి రాంబాబు, మండల గౌరవ అధ్యక్షులు బోనంగి సత్యనారాయణ పడాల్, సీనియర్ UTF నాయకులు గుజ్జెల కొండబాబు, మండల ప్రధాన కార్యదర్శి జన్ని దేముడు, ఉపాధ్యక్షులు సోమేల గంగరాజు, హైస్కూల్ శాఖ నాయకులు తడబారికి బాలకృష్ణ, మహిళా అధ్యక్షులు వి.వి. ఉషారాణి, పూర్వ ప్రధాన కార్యదర్శి బిడ్డ సింహాచలం, ట్రెజరర్ బి. విజయ్ కుమార్, పూర్వ అధ్యక్షులు కేత రామారావు, జిల్లా కౌన్సిలర్లు కమిడి ప్రసాద్, గార నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, విద్యపై ఫిన్లాండ్ దేశంలో శిక్షణ పొందిన మరియు UTF సీనియర్ నాయకులు శెట్టి రాంబాబు, అనంతగిరి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల-2 ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి మంగమ్మ, టోకూరు గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల తెలుగు (SA) ఉపాధ్యాయురాలు రొబ్బ సూర్యకాంతం, పులుసుమామిడి మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు ఉమశ్రీ, కాసీపట్నం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు బి.బి. విజయ, డముకు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఎల్.బి. మంజునాథ్, బీంపోలు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు మూతిబోయిన సురేష్లను పుష్పగుచ్ఛాలు, మెమెంటోలు, దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల, శివలింగపురం ప్రధానోపాధ్యాయులు శెట్టి సుబ్బారావు, డిప్యూటీ ప్రధానోపాధ్యాయులు గుజ్జెల కొండబాబు, లుంగపర్తి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు తడబారికి బాలకృష్ణ మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థులకు వినూత్న పద్ధతుల్లో విద్యను అందిస్తూ, ఎంతోమంది విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్న ఉత్తమ ఉపాధ్యాయులను అభినందించారు.
పాఠశాల అభివృద్ధిలో అహర్నిశలు భాగస్వాములవుతూ, సమాజ సేవలోనూ తమదైన ముద్ర వేస్తున్న ఉపాధ్యాయులకు అవార్డులు మరింత బాధ్యతను పెంచుతాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పుడిగి నాగేశ్వరరావు, పి. శ్యామల, జె. శివ, చేపల వెంకట్రావు, శెట్టి మహేశ్వరి, బాకా అరుణ, స్వామి నాయుడు, కపాటి విజయకుమారి, పద్మావతి, తనూజ తదితరులు పాల్గొన్నారు.


