Monday, 21 September 2026
  • Home  
  • ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
- కడప

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ లభించిందని వైఎస్సార్‌సీపీ నాయకులు రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం జీఓ జారీ చేసినట్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి వైఎస్సార్‌సీపీని మరింత బలోపేతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి యేకుల రాజేశ్వరి రెడ్డి మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ లభించిందని వైఎస్సార్‌సీపీ నాయకులు రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తెలిపారు.

రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం జీఓ జారీ చేసినట్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.

ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి వైఎస్సార్‌సీపీని మరింత బలోపేతం చేయాలని కోరారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి యేకుల రాజేశ్వరి రెడ్డి మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.