అనకాపల్లి జిల్లా,ఆగస్టు 9(పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్)
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఏటికొప్పాక లక్కబొమ్మల కళను ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దంపతులు సందర్శించి కళాకారులను అభినందించారు. ఏటికొప్పాకలోని కళాఖండాలను ఆసక్తిగా పరిశీలించిన ఆయన.. లక్కబొమ్మల తయారీ విధానం, వాటి ప్రత్యేకత, సహజసిద్ధమైన ప్రకృతి రంగుల వినియోగం గురించి కళాకారులను అడిగి తెలుసుకున్నారు.
ఏటికొప్పాక లక్కబొమ్మల వెనుక తరతరాలుగా కొనసాగుతున్న కళా సంప్రదాయం, కళాకారుల శ్రమను చాగంటి కోటేశ్వరరావు ప్రశంసించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, కళాకారులు చాగంటి కోటేశ్వరరావును ఏటికొప్పాక గ్రామానికి ఆహ్వానించి, తమ గ్రామంలో ఒకసారి ప్రవచనం ఇవ్వాలని హృదయపూర్వకంగా కోరారు. దీనికి స్పందించిన ఆయన త్వరలోనే ఏటికొప్పాకకు ఒక రోజు కేటాయించి, కళాకారులు, గ్రామ ప్రజల కోసం తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు.
చాగంటి కోటేశ్వరరావు పర్యటనతో ఏటికొప్పాక కళాకారుల్లో ఆనందం నెలకొంది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, లక్కబొమ్మల కళాకారులు పాల్గొన్నారు.

ఏటికొప్పాక లక్కబొమ్మల కళకు చాగంటి నీరాజనం.. కళాకారుల కోసం ప్రత్యేకంగా వస్తానని హామీ
అనకాపల్లి జిల్లా,ఆగస్టు 9(పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్) ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఏటికొప్పాక లక్కబొమ్మల కళను ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దంపతులు సందర్శించి కళాకారులను అభినందించారు. ఏటికొప్పాకలోని కళాఖండాలను ఆసక్తిగా పరిశీలించిన ఆయన.. లక్కబొమ్మల తయారీ విధానం, వాటి ప్రత్యేకత, సహజసిద్ధమైన ప్రకృతి రంగుల వినియోగం గురించి కళాకారులను అడిగి తెలుసుకున్నారు. ఏటికొప్పాక లక్కబొమ్మల వెనుక తరతరాలుగా కొనసాగుతున్న కళా సంప్రదాయం, కళాకారుల శ్రమను చాగంటి కోటేశ్వరరావు ప్రశంసించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, కళాకారులు చాగంటి కోటేశ్వరరావును ఏటికొప్పాక గ్రామానికి ఆహ్వానించి, తమ గ్రామంలో ఒకసారి ప్రవచనం ఇవ్వాలని హృదయపూర్వకంగా కోరారు. దీనికి స్పందించిన ఆయన త్వరలోనే ఏటికొప్పాకకు ఒక రోజు కేటాయించి, కళాకారులు, గ్రామ ప్రజల కోసం తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు. చాగంటి కోటేశ్వరరావు పర్యటనతో ఏటికొప్పాక కళాకారుల్లో ఆనందం నెలకొంది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, లక్కబొమ్మల కళాకారులు పాల్గొన్నారు.

