Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

ఏటికొప్పాక అభివృద్ధికి కృషి చేస్తాం.. ప్రజాసేవే మా లక్ష్యం: వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఏటికొప్పాక అభివృద్ధికి కృషి చేస్తాం.. ప్రజాసేవే మా లక్ష్యం: వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు

వార్త ముఖ్యాంశాలు

  • ఏటికొప్పాక గ్రామం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీటీసీ-1 అభ్యర్థిగా యడ్ల అప్పారావు, ఎంపీటీసీ-2 అభ్యర్థిగా బగుడు గోవిందు, జడ్పీటీసీ అభ్యర్థిగా రాజన్న శ్రీనివాసరావు ఎన్నికల బరిలో నిలిచారు.
  • గ్రామ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలనే లక్ష్యంతో పోటీ చేస్తున్నట్లు అభ్యర్థులు తెలిపారు.
  • గ్రామంలో రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, తాగునీటి సదుపాయాలు, పారిశుధ్యం, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.

ఏటికొప్పాక గ్రామం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీటీసీ-1 అభ్యర్థిగా యడ్ల అప్పారావు, ఎంపీటీసీ-2 అభ్యర్థిగా బగుడు గోవిందు, జడ్పీటీసీ అభ్యర్థిగా రాజన్న శ్రీనివాసరావు ఎన్నికల బరిలో నిలిచారు. గ్రామ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలనే లక్ష్యంతో పోటీ చేస్తున్నట్లు అభ్యర్థులు తెలిపారు. గ్రామంలో రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, తాగునీటి సదుపాయాలు, పారిశుధ్యం, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వాములమవుతామని, గ్రామ అభివృద్ధికి బాధ్యతాయుతంగా పనిచేస్తామని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సేవ చేయడానికి తమకు ఒక అవకాశం కల్పించాలని, గురువారం జరిగే ఎన్నికల్లో తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లను అభ్యర్థించారు.

వార్తా మూలాలు

  • కె. ఆనంద్పత్రిక / వెబ్‌సైట్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *