ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ మహాసభల సన్నాహక సమావేశాన్ని జిల్లా అధ్యక్షులు భారతల గోవర్ధన్ అధ్యక్షతన నిర్వహించగా రాష్ట్ర కార్యదర్శి విలాస్ హాజరై మాట్లాడుతు దేశంలో 37 చట్టాలు సాధించడంలో కీలక పాత్ర ఏఐటీయూసీ పోషించిందన్నారు.
నేడు కేంద్రంలో రాష్ట్రంలో పాలిస్తున్న అధికార పార్టీలు కార్మికుల చట్టాలను తుంగలో తొక్కుతూ పెట్టుబడి కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలుకుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలన్నారు. అదేవిధంగా ఏఐటియుసి జిల్లా మహాసభలను జులై 19న ఉదయం 11:00 గం.లకు కార్మిక మహా ప్రదర్శన ర్యాలీ నిర్వహించి, అదే రోజు 1:00 గం.లకు 100 మందితో ప్రతినిధుల సభ నిర్వహించుకోని, చురుకైన నూతన నాయకత్వాన్ని ఎన్నుకొని కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవాలంబిస్తున్న తిరును తిప్పి కొట్టడం కోసం భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. 23 మందితో కూడిన ఫండ్ కమిటీ, భోజనాల కమిటీ, అలంకరణ కమిటీలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి గాజంగుల రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు రాజన్న, మంతెన కాంతారావు, గంగయ్య, కీర్తి రమణ, ఉస్మాన్, ఆశన్న, జిల్లా కౌన్సిల్ సభ్యులు, అనుబంధ సంఘాల జిల్లా నాయకులు పాల్గొన్నారు.

ఏఐటీయూసీ మహాసభల సన్నాహక సమావేశం
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ మహాసభల సన్నాహక సమావేశాన్ని జిల్లా అధ్యక్షులు భారతల గోవర్ధన్ అధ్యక్షతన నిర్వహించగా రాష్ట్ర కార్యదర్శి విలాస్ హాజరై మాట్లాడుతు దేశంలో 37 చట్టాలు సాధించడంలో కీలక పాత్ర ఏఐటీయూసీ పోషించిందన్నారు. నేడు కేంద్రంలో రాష్ట్రంలో పాలిస్తున్న అధికార పార్టీలు కార్మికుల చట్టాలను తుంగలో తొక్కుతూ పెట్టుబడి కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలుకుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలన్నారు. అదేవిధంగా ఏఐటియుసి జిల్లా మహాసభలను జులై 19న ఉదయం 11:00 గం.లకు కార్మిక మహా ప్రదర్శన ర్యాలీ నిర్వహించి, అదే రోజు 1:00 గం.లకు 100 మందితో ప్రతినిధుల సభ నిర్వహించుకోని, చురుకైన నూతన నాయకత్వాన్ని ఎన్నుకొని కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవాలంబిస్తున్న తిరును తిప్పి కొట్టడం కోసం భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. 23 మందితో కూడిన ఫండ్ కమిటీ, భోజనాల కమిటీ, అలంకరణ కమిటీలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి గాజంగుల రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు రాజన్న, మంతెన కాంతారావు, గంగయ్య, కీర్తి రమణ, ఉస్మాన్, ఆశన్న, జిల్లా కౌన్సిల్ సభ్యులు, అనుబంధ సంఘాల జిల్లా నాయకులు పాల్గొన్నారు.

