Sunday, 16 August 2026
  • Home  
  • ఎస్పీ కార్యాలయంలో రెపరెపలాడిన జాతీయ పతాకం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఎస్పీ కార్యాలయంలో రెపరెపలాడిన జాతీయ పతాకం

ఎస్పీ క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య ఘనంగా వేడుకలు జెండా వందనం చేసిన ఎస్పీ పోలీసు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ పున్నమి దినపత్రిక, ఆగస్టు 15: డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఐపీఎస్ ఆధ్వర్యంలో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ మీనా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనంఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ మీనా పోలీసు అధికారులు, సిబ్బందికి 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ సేవలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తోందని, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. అనంతరం పోలీసు సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు, ఎస్బీ సీఐ పుల్లారావు, డీసీఆర్‌బీ సీఐ రాజేష్, సోషల్ మీడియా సీఐ తమ్మినాయుడు, ఆర్‌ఐ బ్రహ్మానందం, ఆర్‌ఎస్‌ఐ ఏసుబాబు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. *# శివకృష్ణ.పినిపే -పున్నమి దినపత్రిక*

ఎస్పీ క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య ఘనంగా వేడుకలు

జెండా వందనం చేసిన ఎస్పీ

పోలీసు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

పున్నమి దినపత్రిక, ఆగస్టు 15: డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఐపీఎస్ ఆధ్వర్యంలో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ మీనా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనంఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ మీనా పోలీసు అధికారులు, సిబ్బందికి 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ సేవలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తోందని, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. అనంతరం పోలీసు సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు, ఎస్బీ సీఐ పుల్లారావు, డీసీఆర్‌బీ సీఐ రాజేష్, సోషల్ మీడియా సీఐ తమ్మినాయుడు, ఆర్‌ఐ బ్రహ్మానందం, ఆర్‌ఎస్‌ఐ ఏసుబాబు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

*# శివకృష్ణ.పినిపే -పున్నమి దినపత్రిక*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.