– ముదినేపల్లిలో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం
– సొంత నిధులతో విరాళం అందించిన గౌసల్ల కంచు రామకృష్ణ
రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం ముదినేపల్లి గ్రామంలో శ్రీ బండపల్లి ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.50 వేల విరాళం అందించారు. భారత చైతన్య యువజన పార్టీ సీనియర్ నాయకులు, శ్రీకృష్ణ యాదవ సంఘం సేవా సమితి కువైట్–ఇండియా అధ్యక్షులు గౌసల్ల కంచు రామకృష్ణ తన సొంత నిధులతో ఈ మొత్తాన్ని సమకూర్చారు. బీసీవై పార్టీ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, ఆలయ చైర్మన్‌కు విరాళాన్ని అందజేశారు. ఆలయ అభివృద్ధికి సహకరించడం ద్వారా గ్రామంలో సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కువైట్ ఎన్నారై బొల్లు వెంకటేష్, తిరుపతి జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ రెడ్డిపాకు మహేష్, రైల్వే కోడూరు నియోజకవర్గ రైతు కమిటీ కన్వీనర్ పోకల నాగభూషణ్, ఓబులవారిపల్లి మండల కన్వీనర్ యానాదయ్య, రైల్వే కోడూరు మండల కో-కన్వీనర్ నాగేష్, బీసీవై పార్టీ నాయకులు, ముదినేపల్లి గ్రామస్థులు పాల్గొన్నారు.


