ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్ధితి నెలకొందని అరకు ఏడీఏ వి. మోహనరావు అన్నారు. శుక్రవారం అనంతగిరి మండలం, లక్ష్మీపురం గ్రామంలో నిర్వహించిన రైతన్న మీ కోసం కార్యక్రమంలో ఏడిఏ మాట్లాడారు. ఎల్ నినో ప్రభావాన్ని ఏవిధంగా ఎదుర్కోవాలో వివరించారు. వర్షాభావ పరిస్థితులని తట్టుకోవడానికి రైతులు తక్కువ కాలపరిమితి, ఆరుతడి పంటలను వేయాలని సూచించారు. మండల వ్యవసాయ అధికారి రంగారావు, విఏఏ కుమారి ఉన్నారు.

ఎల్ నినో ప్రభావం తో ఆరుతడి పంటలను వేయాలి: అరకు ఏడిఏ