*ఎండదెబ్బతో కోట నిరంజన్ మృతి*
మధిర మండలం ఇల్లూరు గ్రామానికి చెందిన కోట నిరంజన్ వడదెబ్బతో మృతి చెందిన విషాద సంఘటన గ్రామంలో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అతనుకి భార్య ఇద్దరు ఆడపిల్లలు కలిగి ఉన్నారు.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, గత ఆదివారం వారి సొంత బంధువులైన నందిగామ మండలం, తక్కెలపాడు గ్రామానికి చెందిన సొంత బామ్మర్ది, అలాగే వీర్లపాడు గ్రామానికి చెందిన తోడ అల్లుడు ఒకేరోజు మృతి చెందడంతో వారిరువురిని పరామర్శించి అంత్యక్రియల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తీవ్ర ఎండలో కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన అనంతరం నిరంజన్ అస్వస్థతకు గురయ్యారు.
వెంటనే ఆయనను ఖమ్మం ఆసుపత్రికి తరలించగా, వడదెబ్బ తీవ్రంగా తగలడంతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. రెండు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఈరోజు22/05/26 ఇంటికి తీసుకువచ్చారు. అయితే రాత్రి 10 గంటల సమయంలో ఇల్లూరు గ్రామంలోని తన నివాసంలో ఆయన మృతి చెందారు.
కోట నిరంజన్ మృతితో ఇల్లూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు, బంధువులు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఎండదెబ్బతో కోట నిరంజన్ మృతి*
*ఎండదెబ్బతో కోట నిరంజన్ మృతి* మధిర మండలం ఇల్లూరు గ్రామానికి చెందిన కోట నిరంజన్ వడదెబ్బతో మృతి చెందిన విషాద సంఘటన గ్రామంలో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అతనుకి భార్య ఇద్దరు ఆడపిల్లలు కలిగి ఉన్నారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, గత ఆదివారం వారి సొంత బంధువులైన నందిగామ మండలం, తక్కెలపాడు గ్రామానికి చెందిన సొంత బామ్మర్ది, అలాగే వీర్లపాడు గ్రామానికి చెందిన తోడ అల్లుడు ఒకేరోజు మృతి చెందడంతో వారిరువురిని పరామర్శించి అంత్యక్రియల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తీవ్ర ఎండలో కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన అనంతరం నిరంజన్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఖమ్మం ఆసుపత్రికి తరలించగా, వడదెబ్బ తీవ్రంగా తగలడంతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. రెండు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఈరోజు22/05/26 ఇంటికి తీసుకువచ్చారు. అయితే రాత్రి 10 గంటల సమయంలో ఇల్లూరు గ్రామంలోని తన నివాసంలో ఆయన మృతి చెందారు. కోట నిరంజన్ మృతితో ఇల్లూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు, బంధువులు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

