శ్రీకాళహస్తి, ఏప్రిల్ 23 (పున్నమి న్యూస్( ఎంజీఎం స్కూల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) ఆధారంగా నిర్వహించిన క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు. ఈ పోటీలను ఎఐ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంజీఎం గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా అభివృద్ధి చేసుకునే అవకాశముందని తెలిపారు. వైద్య రంగంలో రోబోటిక్ సాంకేతికతతో ఖచ్చితత్వంతో శస్త్రచికిత్సలు నిర్వహించడం, రోగుల పునరావాసంలో రోబోలు సహకరించడం వంటి అంశాలను వివరించారు. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో రోబోట్స్ వినియోగం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ పనితీరు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్మాస్టర్ మునిరత్నం నాయుడు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.

ఎంజీఎం స్కూల్లో ఎఐ క్విజ్ పోటీలు… ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పురస్కారాలు