నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన మరణం తెలంగాణకు తీరని లోటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు
ఉద్యమ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం