Sunday, 6 September 2026
  • Home  
  • ఉదయగిరిలో బీసీ హాస్టల్‌ను పునఃప్రారంభించాలి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో బీసీ హాస్టల్‌ను పునఃప్రారంభించాలి

ఉదయగిరి నియోజకవర్గంలో బీసీ విద్యార్థుల కోసం గతంలో కొనసాగిన బీసీ హాస్టల్‌ను వెంటనే పునఃప్రారంభించాలని వరికుంటపాడు మాజీ సర్పంచ్ కొండెపోగు దిలీప్ కుమార్ కోరారు. హాస్టల్ మూసివేయడంతో పేద, వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులు వసతి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దూర ప్రాంతాల నుంచి విద్యనభ్యసించేందుకు వచ్చే విద్యార్థులకు హాస్టల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి అవసరమైన మౌలిక వసతులు కల్పించి హాస్టల్‌ను తిరిగి ప్రారంభించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనివల్ల విద్యార్థులకు వసతి సౌకర్యం లభించడంతో పాటు చదువుపై మరింత దృష్టి సారించే అవకాశం ఉంటుందని దిలీప్ కుమార్ పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.