ఉదయగిరి పట్టణంలో రాయల కాలంలో నిర్మించిన రంగనాయకుల ఆలయ కట్టడాలు శిథిలావస్థకు చేరడంతో పురావస్తు శాఖ పరిరక్షణ చర్యలు చేపట్టింది. చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన ఈ పురాతన ఆలయ కట్టడాలను కాపాడేందుకు శిథిలమైన ప్రాంతాల్లో మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఆలయ నిర్మాణ శైలికి ఎలాంటి నష్టం కలగకుండా అధికారులు పనులను పర్యవేక్షిస్తున్నారు. ఆలయం లోపల రాతిబండల ఏర్పాటుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం మరింత పటిష్టంగా మారనుంది. పురాతన కట్టడాల పరిరక్షణకు శాఖ చర్యలు చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ చారిత్రక వైభవాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు పనులు కొనసాగుతున్నాయి.

ఉదయగిరిలో పురాతన ఆలయానికి రిపేర్లు