*ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో గణనాథుడికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు*
కావలి: ఆదివారం,20
వినాయక స్వామి ఉత్సవాల్లో భాగంగా కావలి పట్టణంలోని ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో భగత్ సింగ్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దర్శించుకున్నారు.ఈ సందర్భంగా స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని, గణనాథుడికి పూజలు నిర్వహించారు. అనంతరం గణపతి స్వామి ఆశీస్సులు పొందారు.వినాయక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య కొనసాగాలని, కావలి నియోజకవర్గ ప్రజలందరికీ సుఖసంతోషాలు,ఆయురారోగ్యాలు ప్రసాదించాలని గణనాథుడిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.



