సింగరేణి లో డిప్యూటీ మేనేజర్ గా Gdk-2&2A ఇంక్లైన్ లో విధులు నిర్వహిస్తున్న కడార్ల పూర్ణ చందర్‌కు అరుదైన గౌరవం
ప్రతిష్టాత్మక ‘డాక్టరేట్’ మరియు ‘భారత్ గౌరవ్ రత్న సమ్మాన్’ పురస్కారాల ప్రదానం
న్యూఢిల్లీ/హైదరాబాద్:
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో డిప్యూటీ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీ కడార్ల పూర్ణ చందర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. గనుల భద్రత మరియు రెస్క్యూ ఆపరేషన్స్ (Mining Safety & Rescue Operations) విభాగంలో ఆయన చేసిన విశేష కృషికి మరియు అంకితభావానికి గాను ప్రతిష్టాత్మక ‘గౌరవ డాక్టరేట్’ తో పాటు ‘భారత్ గౌరవ్ రత్న సమ్మాన్’ పురస్కారాలు లభించాయి.
సెప్టెంబర్ 19, 2026 న (శనివారం) న్యూఢిల్లీలోని నేషనల్ సైన్స్ సెంటర్లో అత్యంత ఘనంగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాలను అందుకున్నారు. ప్రముఖ సంస్థ అయిన ‘వరల్డ్ కల్చర్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కమిషన్’ (World Culture Environment Protection Commission) ఈ పురస్కారాలను ప్రదానం చేసింది. సెప్టెంబర్ 5, 2026 న ఈ అవార్డుల ఎంపికను కమిషన్ అధికారికంగా ప్రకటించింది.
గనుల్లో అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రాణాలకు తెగించి రెస్క్యూ ఆపరేషన్స్ విజయవంతంగా నిర్వహించడంలో మరియు మైనింగ్ భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడంలో శ్రీ కదర్ల పూర్ణ చందర్ కనబరిచిన ధైర్యసాహసాలు, నైపుణ్యాలకు గుర్తింపుగా ఈ అంతర్జాతీయ స్థాయి పురస్కారాలు దక్కాయి.
ఈ జాతీయ స్థాయి అవార్డులు అందుకోవడం పట్ల సింగరేణి అధికారులు, తోటి ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు మరియు ఆయన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ శ్రీ పూర్ణ చందర్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.



