ఉదయగిరి అటవీశాఖ రేంజ్ కార్యాలయ ఆవరణంలో జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినాన్ని ఘనంగా నిర్వహించారు. రేంజర్ బి.ఎస్. కుమార్ రాజా ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అటవీశాఖ అమరవీరుల సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వారి త్యాగాలు స్ఫూర్తిదాయకమని అధికారులు పేర్కొన్నారు. అడవులు, వన్యప్రాణుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అటవీశాఖ సిబ్బంది పాల్గొని అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.

ఉదయగిరి : అటవీ అమరవీరులకు ఘన నివాళి