ఉత్తరప్రదేశ్లో విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం మరో ఆర్థిక భారం మోపింది. ఇంధన, విద్యుత్ కొనుగోలు సర్దుబాటు సర్చార్జ్ (FPPAS) పేరుతో విద్యుత్ బిల్లులపై 10 శాతం అదనపు చార్జీ విధిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ ప్రకటించింది. జూన్ నెల బిల్లుల నుంచి ఈ సర్చార్జ్ అమల్లోకి రానుంది. విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలు వ్యయాల పెరుగుదల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఇప్పటికే ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై మరింత భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్లో విద్యుత్ బిల్లులపై 10 శాతం అదనపు భారం