Tuesday, 22 September 2026
  • Home  
  • ఉత్తమ అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం
- తిరుపతి

ఉత్తమ అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం

రామచంద్రపురం ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి రామచంద్రాపురం మండలంలో ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ప్రజలకు అవసరమైన సేవలను అందించడంలో విశేష ప్రతిభ కనబరిచిన అధికారులను మండల తెలుగ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డులు అందుకున్న డిప్యూటీ ఎంపీడీవో తేజవతి, విద్యుత్ శాఖ ఏఈ గిరి, ఇరిగేషన్ ఏఈ రాజులను ఎంపీడీవో కార్యాలయంలో శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన సేవలను అందించడంలో అధికారులు చూపిన చొరవ, నిబద్ధత అభినందనీయమన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి ఉద్యోగులను గుర్తించి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో ఉత్తమ అవార్డులతో సత్కరించడం వారికి మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. అవార్డులు పొందిన అధికారులు భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని, మరెనో పురస్కారాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ తమ విధులను అంకితభావంతో నిర్వహించాలని నాయకులు సూచించారు. ఉత్తమ సేవలను అందించే ఉద్యోగులను ప్రోత్సహించడం ద్వారా ఇతర ఉద్యోగుల్లోనూ సేవా స్ఫూర్తి పెంపొందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిరుమలరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు జనార్దన్ చౌదరి, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ చిన్నబాబు, మధుసూదన్రెడ్డి, టీడీపీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొని అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు.

రామచంద్రపురం ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి

రామచంద్రాపురం మండలంలో ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ప్రజలకు అవసరమైన సేవలను అందించడంలో విశేష ప్రతిభ కనబరిచిన అధికారులను మండల తెలుగ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డులు అందుకున్న డిప్యూటీ ఎంపీడీవో తేజవతి, విద్యుత్ శాఖ ఏఈ గిరి, ఇరిగేషన్ ఏఈ రాజులను ఎంపీడీవో కార్యాలయంలో శాలువాలతో సత్కరించి అభినందనలు
తెలిపారు.
ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన సేవలను అందించడంలో అధికారులు చూపిన చొరవ, నిబద్ధత అభినందనీయమన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి ఉద్యోగులను గుర్తించి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో ఉత్తమ అవార్డులతో సత్కరించడం వారికి మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. అవార్డులు పొందిన అధికారులు భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని, మరెనో పురస్కారాలు సాధించాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ తమ విధులను అంకితభావంతో నిర్వహించాలని నాయకులు సూచించారు. ఉత్తమ సేవలను అందించే ఉద్యోగులను ప్రోత్సహించడం ద్వారా ఇతర ఉద్యోగుల్లోనూ సేవా స్ఫూర్తి పెంపొందుతుందని
తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిరుమలరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు జనార్దన్ చౌదరి, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ చిన్నబాబు, మధుసూదన్రెడ్డి, టీడీపీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొని అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.