కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 15: భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఇంజనీర్స్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జగ్గంపేటలో ప్రముఖ ఇంజనీర్ సత్తి సదాశివరెడ్డిని రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్తకొండ బాబు ఘనంగా సత్కరించి ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కొత్తకొండ బాబు మాట్లాడుతూఇంజనీర్లే దేశానికి వెన్నెముక* అని అన్నారు. ఒక కలను కాగితంపై డిజైన్ గా మార్చి, దానిని క్షేత్రంలో అద్భుతమైన కట్టడంగా నిలబెట్టే నైపుణ్యం ఇంజనీర్ల సొంతమని కొనియాడారు.రోడ్లు, భవనాలు, డ్యాములు, బ్రిడ్జిలు, టెక్నాలజీ ఇలా దేశ అభివృద్ధిలో ప్రతి అడుగులో ఇంజనీర్ల పాత్ర మరువలేనిదని, వారి ఆలోచన, ఆవిష్కరణ, అంకితభావంతోనే సమాజం ముందుకు వెళుతోందని అన్నారు.సత్తి సదాశివరెడ్డి తన ఇంజనీరింగ్ నైపుణ్యంతో ఎన్నో నిర్మాణాలకు తన ముద్ర వేశారని, అలాగే గణపతి నవరాత్రులు పురస్కరించుకుని వినాయక మండపాలకు విగ్రహాలు అందించడం, అన్నదానాలు నిర్వహించడం, పేదలకు దానాలు చేయటం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలతో యువ ఇంజనీర్లకు ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు.ఇంజనీర్లందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇంజనీర్స్ డే వేడుక ప్రముఖ ఇంజనీర్ ని సత్కరించిన కొత్తకొండ బాబు
కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 15: భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఇంజనీర్స్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జగ్గంపేటలో ప్రముఖ ఇంజనీర్ సత్తి సదాశివరెడ్డిని రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్తకొండ బాబు ఘనంగా సత్కరించి ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కొత్తకొండ బాబు మాట్లాడుతూఇంజనీర్లే దేశానికి వెన్నెముక* అని అన్నారు. ఒక కలను కాగితంపై డిజైన్ గా మార్చి, దానిని క్షేత్రంలో అద్భుతమైన కట్టడంగా నిలబెట్టే నైపుణ్యం ఇంజనీర్ల సొంతమని కొనియాడారు.రోడ్లు, భవనాలు, డ్యాములు, బ్రిడ్జిలు, టెక్నాలజీ ఇలా దేశ అభివృద్ధిలో ప్రతి అడుగులో ఇంజనీర్ల పాత్ర మరువలేనిదని, వారి ఆలోచన, ఆవిష్కరణ, అంకితభావంతోనే సమాజం ముందుకు వెళుతోందని అన్నారు.సత్తి సదాశివరెడ్డి తన ఇంజనీరింగ్ నైపుణ్యంతో ఎన్నో నిర్మాణాలకు తన ముద్ర వేశారని, అలాగే గణపతి నవరాత్రులు పురస్కరించుకుని వినాయక మండపాలకు విగ్రహాలు అందించడం, అన్నదానాలు నిర్వహించడం, పేదలకు దానాలు చేయటం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలతో యువ ఇంజనీర్లకు ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు.ఇంజనీర్లందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.

