Thursday, 23 April 2026
  • Home  
  • ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించాలని రాష్ట్ర మంత్రిమండలి విజ్ఞప్తి
- E-పేపర్

ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించాలని రాష్ట్ర మంత్రిమండలి విజ్ఞప్తి

పున్నమి న్యూస్ ప్రతినిధి 23 ఏప్రిల్ 2026 తెలంగాణ ఇంచార్జ్ రంగారెడ్డి జిల్లా ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించాలని రాష్ట్ర మంత్రిమండలి విజ్ఞప్తి చేసింది. చర్చల ద్వారా కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలియజేసింది. చర్చలకు రావాలని కార్మిక సంఘాలను ఆహ్వానించింది. కార్మిక సంఘాల ప్రతినిధులతో రేపు (శుక్రవారం) చర్చలు జరపాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందానికి చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సుదీర్ఘంగా చర్చించింది. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని సమావేశంలో ముఖ్యమంత్రి సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు విషయాన్ని మంత్రివర్గ సమావేశం చర్చించింది. జ్యుడీషియల్ కమిషన్ నియామకాన్ని హైకోర్టు తప్పుబట్టలేదని, పైగా కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమని, రాజ్యాంగబద్ధమని కూడా అభిప్రాయపడిందని సమావేశంలో అడ్వకేట్ జనరల్ తీర్పు వివరాలను వెల్లడించారు. ఆ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని దీనిపై న్యాయనిపుణులతో చర్చించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సంబంధించి బెనిఫిట్స్ అందించే అంశంపై మంత్రివర్గ సమావేశం చర్చించింది. రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి రూ. 6,200 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ. 8 వేల కోట్లు పెండింగ్‌లో ఉండగా, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి అవసరమైన నిధులను సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. ఆర్థిక వనరుల సమీకరణలో భాగంగా ప్రజాప్రతినిధుల జీతాల్లో 50 శాతం తగ్గించి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సర్దుబాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలన్న ప్రతిపాదనపై మంత్రులంతా ఉదారంగా ముందుకొచ్చి తమ ఆమోదం తెలియజేశారు. అలాగే, రిసోర్స్ మొబిలైజేషన్ కోసం నియమించిన సబ్ కమిటీ వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగ సంఘాలను పిలిచి చర్చలు జరపాలని, ఆర్థిక వనరుల సమీకరణతో పాటు వీలైనంత తొందరగా సమస్యను పరిష్కరించాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లోని గచ్చీబౌలి స్టేడియాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. స్టేడియంకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న 76 ఎకరాల్లో 64 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో 21 రకాల క్రీడలకు సంబంధించిన సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించారు. మంథని నియోజకవర్గ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. అలాగే, మంచిర్యాల జిల్లా హాజీపూర్ రెవెన్యూ పరిధిలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిసరాల్లో ఇంటిగ్రేటెడ్ అక్వా పార్క్‌ను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపారు. ఈ వివరాలను మంత్రులు శ్రీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి , శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి , శ్రీ వాకిటి శ్రీహరి పత్రికా సమావేశంలో వెల్లడించారు. అంతకుముందు మంత్రులు పొన్నం ప్రభాకర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు , దామోదర రాజనర్సింహ , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విడిగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి కట్టుబడి ఉందని, కార్మికుల డిమాండ్లపై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ సమయంలో కార్మికులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, అనాలోచిత చర్యలకు పాల్పడి తమ కుటుంబాలకు అన్యాయం చేయొద్దని కోరారు. క్షణికావేశంలో ఆత్మబలిదానాలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం పూర్తిగా సానుకూల దృక్పథంతో ఉందని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు.

పున్నమి న్యూస్ ప్రతినిధి
23 ఏప్రిల్ 2026
తెలంగాణ ఇంచార్జ్
రంగారెడ్డి జిల్లా

ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించాలని రాష్ట్ర మంత్రిమండలి విజ్ఞప్తి చేసింది. చర్చల ద్వారా కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలియజేసింది. చర్చలకు రావాలని కార్మిక సంఘాలను ఆహ్వానించింది. కార్మిక సంఘాల ప్రతినిధులతో రేపు (శుక్రవారం) చర్చలు జరపాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందానికి చెప్పారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సుదీర్ఘంగా చర్చించింది. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని సమావేశంలో ముఖ్యమంత్రి సూచించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు విషయాన్ని మంత్రివర్గ సమావేశం చర్చించింది. జ్యుడీషియల్ కమిషన్ నియామకాన్ని హైకోర్టు తప్పుబట్టలేదని, పైగా కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమని, రాజ్యాంగబద్ధమని కూడా అభిప్రాయపడిందని సమావేశంలో అడ్వకేట్ జనరల్ తీర్పు వివరాలను వెల్లడించారు.
ఆ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని దీనిపై న్యాయనిపుణులతో చర్చించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది.
పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సంబంధించి బెనిఫిట్స్ అందించే అంశంపై మంత్రివర్గ సమావేశం చర్చించింది. రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి రూ. 6,200 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ. 8 వేల కోట్లు పెండింగ్‌లో ఉండగా, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి అవసరమైన నిధులను సర్దుబాటు చేయాలని నిర్ణయించారు.
ఆర్థిక వనరుల సమీకరణలో భాగంగా ప్రజాప్రతినిధుల జీతాల్లో 50 శాతం తగ్గించి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సర్దుబాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలన్న ప్రతిపాదనపై మంత్రులంతా ఉదారంగా ముందుకొచ్చి తమ ఆమోదం తెలియజేశారు.
అలాగే, రిసోర్స్ మొబిలైజేషన్ కోసం నియమించిన సబ్ కమిటీ వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగ సంఘాలను పిలిచి చర్చలు జరపాలని, ఆర్థిక వనరుల సమీకరణతో పాటు వీలైనంత తొందరగా సమస్యను పరిష్కరించాలని నిర్ణయించారు.
హైదరాబాద్‌లోని గచ్చీబౌలి స్టేడియాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. స్టేడియంకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న 76 ఎకరాల్లో 64 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో 21 రకాల క్రీడలకు సంబంధించిన సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించారు.
మంథని నియోజకవర్గ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. అలాగే, మంచిర్యాల జిల్లా హాజీపూర్ రెవెన్యూ పరిధిలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిసరాల్లో ఇంటిగ్రేటెడ్ అక్వా పార్క్‌ను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపారు.
ఈ వివరాలను మంత్రులు శ్రీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి , శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి , శ్రీ వాకిటి శ్రీహరి పత్రికా సమావేశంలో వెల్లడించారు.
అంతకుముందు మంత్రులు పొన్నం ప్రభాకర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు , దామోదర రాజనర్సింహ , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విడిగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి కట్టుబడి ఉందని, కార్మికుల డిమాండ్లపై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ సమయంలో కార్మికులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, అనాలోచిత చర్యలకు పాల్పడి తమ కుటుంబాలకు అన్యాయం చేయొద్దని కోరారు. క్షణికావేశంలో ఆత్మబలిదానాలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం పూర్తిగా సానుకూల దృక్పథంతో ఉందని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.