ఖమ్మం నగరంలోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఖమ్మం జిల్లా కార్యాలయంలో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పతాకావిష్కరణ కార్యక్రమంలో జిల్లా సంఘ చాలక్ శ్రీ కాటేపల్లి లక్ష్మీనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విభాగ్ ప్రచారక్ శ్రీ మధు ప్రసంగించారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకోవాలని, దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. యువతలో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు, స్వయం సేవకులు, వివిధ బాధ్యతల్లో ఉన్న ప్రముఖులు పాల్గొని జాతీయ పతాకానికి వందనం చేశారు.



