Saturday, 15 August 2026
  • Home  
  • హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా 198వ వారం అన్నదాన కార్యక్రమం
- మేడ్చల్ – మల్కాజిగిరి

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా 198వ వారం అన్నదాన కార్యక్రమం

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా 198వ వారం అన్నదాన కార్యక్రమం ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే గొప్ప సేవ లేదు: హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్ చందానగర్, ఆగస్టు 15: హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం 198వ వారానికి చేరుకుంది. ఈ సందర్భంగా చందానగర్ గంగారంలోని హోప్ ఫౌండేషన్ కార్యాలయ ప్రాంగణంలో శనివారం ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పేదలు, వృద్ధులు, కూలీలకు స్వయంగా అన్నప్రసాదాలను వడ్డించారు. ఈ సందర్భంగా సుమారు 3,000 మందికి వేడి వేడి భోజనం పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమంలో అన్నం, సాంబారు, కూర, పెరుగు తదితర వంటకాలను వడ్డించారు. ఈ సందర్భంగా కొండ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. “ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే గొప్ప సేవ లేదు. గత 198 వారాలుగా ఎలాంటి ఆటంకం లేకుండా ఈ సేవ కొనసాగడం హోప్ ఫౌండేషన్ సభ్యులు, వాలంటీర్ల అంకితభావానికి నిదర్శనం” అని అన్నారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వారు, వృద్ధులు, కూలీలు, నిరుపేదలకు ఆహారం అందించాలనే సంకల్పంతో అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రతి వారం అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా అన్నదాన సేవను మరింత విస్తృతంగా కొనసాగించి అవసరమైన వారికి అండగా నిలుస్తామని విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని హోప్ ఫౌండేషన్ ప్రతినిధులు, సభ్యులు, వాలంటీర్లు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని అన్నప్రసాదాలను స్వీకరించారు.

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా 198వ వారం అన్నదాన కార్యక్రమం

ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే గొప్ప సేవ లేదు: హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్
చందానగర్, ఆగస్టు 15: హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం 198వ వారానికి చేరుకుంది. ఈ సందర్భంగా చందానగర్ గంగారంలోని హోప్ ఫౌండేషన్ కార్యాలయ ప్రాంగణంలో శనివారం ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పేదలు, వృద్ధులు, కూలీలకు స్వయంగా అన్నప్రసాదాలను వడ్డించారు. ఈ సందర్భంగా సుమారు 3,000 మందికి వేడి వేడి భోజనం పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమంలో అన్నం, సాంబారు, కూర, పెరుగు తదితర వంటకాలను వడ్డించారు.
ఈ సందర్భంగా కొండ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. “ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే గొప్ప సేవ లేదు. గత 198 వారాలుగా ఎలాంటి ఆటంకం లేకుండా ఈ సేవ కొనసాగడం హోప్ ఫౌండేషన్ సభ్యులు, వాలంటీర్ల అంకితభావానికి నిదర్శనం” అని అన్నారు.
సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వారు, వృద్ధులు, కూలీలు, నిరుపేదలకు ఆహారం అందించాలనే సంకల్పంతో అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రతి వారం అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రాబోయే రోజుల్లో కూడా అన్నదాన సేవను మరింత విస్తృతంగా కొనసాగించి అవసరమైన వారికి అండగా నిలుస్తామని విజయ్ కుమార్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని హోప్ ఫౌండేషన్ ప్రతినిధులు, సభ్యులు, వాలంటీర్లు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని అన్నప్రసాదాలను స్వీకరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.