విశాఖపట్నం జిల్లా, మధురవాడ (పున్నమి ప్రతినిధి), ఆగస్టు 15:
మధురవాడ సునీల్ శర్మ కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ పెంకి శంకర్శం గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహనీయుల త్యాగాలకు ప్రతి ఒక్కరూ రుణపడి ఉన్నారని అన్నారు. ఆ రుణాన్ని దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడం ద్వారా తీర్చాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో 7వ వార్డు మాజీ కార్పొరేటర్ పిల్ల మంగమ్మ వెంకట్రావు, 7వ వార్డు మాజీ అధ్యక్షులు పిల్ల నర్సింగరావు, పాఠశాల కో-ఆప్షన్ సభ్యులు మల్లువలస రాము, సీనియర్ నాయకులు పిల్ల రాము, కృష్ణ, నాగోతి నరసింహనాయుడు, చిన్న, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.
పాఠశాల హెచ్ఎం గీతాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దేశభక్తి నినాదాలు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది.


