శ్రీ కాళహస్తి, మే 16 (పున్నమి న్యూస్): ఆన్లైన్ ద్వారా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఔషధాల విక్రయాలను నిరసిస్తూ ఈనెల 19 అర్ధరాత్రి నుంచి 20 అర్ధరాత్రి వరకు దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ నిర్వహించనున్నట్లు శ్రీకాళహస్తి మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ పిలుపు మేరకు ఈ సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. ఈ-ఫార్మసీల కారణంగా లక్షలాది మెడికల్ షాపుల నిర్వాహకుల ఉపాధి దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయాలు పెరగడం వల్ల మత్తు పదార్థాల దుర్వినియోగం అధికమయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అత్యవసర మందుల కోసం హెల్ప్‌లైన్: బంద్ నేపథ్యంలో శ్రీకాళహస్తిలో రోగులకు అత్యవసరంగా మందులు కావలసి వస్తే మధుసూదన్ రావు (9985251463), గోపాల్ (7893266266) నంబర్లను సంప్రదించాలని, వారు మందులు అందజేస్తారని నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మన మధుసూదన్ రావు, ప్రధాన కార్యదర్శి కొండేటి గోపాల్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్ గుప్త, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నరసింహులు (నంద), మాజీ ప్రధాన కార్యదర్శి మునిరెడ్డి, ఉపాధ్యక్షులు చక్రపాణి, చిన్నారావు, మహేందర్ రెడ్డి, మోనిష్ పాల్గొన్నారు.

ఆన్లైన్ మందుల విక్రయాలకు వ్యతిరేకంగా 19న దేశవ్యాప్త మెడికల్ బంద్