ఆత్మకూరు సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి.
ఆత్మకూరు: పట్టణంలోని ఆర్టీవో కార్యాలయంలో గురువారం విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవీఐ రాములు కార్యాలయ సిబ్బందితో కలిసి విశ్వకర్మ భగవానుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎంవీఐ రాములు మాట్లాడుతూ.. విశ్వకర్మ భగవానుడు దేవతల వాస్తుశిల్పిగా ప్రసిద్ధి చెందారని తెలిపారు. తన అపారమైన మేధాశక్తి, నైపుణ్యంతో ఇంద్రలోకాన్ని నిర్మించి దేవతల ప్రశంసలు, కీర్తిని పొందారని పేర్కొన్నారు. నిర్మాణ రంగానికి విశ్వకర్మ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. విశ్వశాంతి, లోకకల్యాణం కోసం విశ్వకర్మ భగవానుడు శ్రమించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


